Featured2 Politics

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒకప్పుడు బీజేపీ అంటే అడ్వానీ..అడ్వానీ అంటే బీజేపీ. ఇప్పుడు అంతా మోదీ మార్క్. గురువైనా,ప్రత్యర్థియినా డోంట్ కేర్. అడ్డుననిపిస్తే అంతే..ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం నమో నయా మంత్రం. అడ్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారనుకుంటే… బాబ్రీ కేసును తిరగతోడటం కమల అభిమానుల్ని కలవరపరుస్తోంది. మోదీ అంటే అభిమానం ఉన్నా… అగ్రనేతని అలా కష్టాలపాల్జేయం ఏం బాగోలేదంటున్నారు. బహుశా..రాష్ట్రపతి పదవి ఎలా ఇవ్వరని ముందే గ్రహించిన అడ్వానీ…తాను రేసులో లేనని తప్పక ప్రకటించుకున్నారు. అయిానా ఆయన రేసులో ఉన్నా లేకున్నా…రాష్ట్రపతిని చేస్తే పార్టీకి, మోదీకి మంచి పేరు వస్తుందని కార్యకర్తలు భావించారు. కానీ ఇప్పుడు బాబ్రీ కూల్చివేత కేసు తెరపైకి రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కష్టకాలంలో ఉన్న అడ్వాణీకి పార్టీ వెన్నంటే ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలిపారు. బాబ్రీ పరిణామాల నేపథ్యంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో అనే విషయంపై బుధవారం సాయంత్రం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసింది. అనంతరం ఆయన బీజేపీ అగ్రనేత అడ్వాణీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అడ్వాణీకి సంఘీభావం తెలిపారు.

అటు కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు అయోధ్య వెళ్లాలని కేంద్రమంత్రి ఉమాభారతి భావించారు. తనపై కుట్ర ఆరోపణలను ఉమాభారతి తిరస్కరించారు..‘ దీనిలో కుట్రకు అవకాశం ఏముంది.. అక్కడ రామమందిరం నిర్మించగా చూడాలనేది నా కల అని బహిరంగంగా చెప్పాను’ అని వ్యాఖ్యానించారు.
విషయం తెలుసుకున్న అమిత్‌షా ఆమెకు ఫోన్‌ చేసి దిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు.