Trends

అనుష్క మాట కాదనలేను..!

 

 

 

 

 

 

 

 

 

ఐపీఎల్‌లో న్యూలుక్‌తో అదరగొడుతున్నారు క్రికెటర్లు. ఏప్రిల్‌ 18న గుజరాత్‌ లయన్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా బ్రేక్‌ దబియర్డ్‌ పేరిట ఓ ఛాలెంజ్‌ను మొదలెట్టాడు. ఈ సవాలును స్వీకరించిన రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా కొత్త లుక్‌తో మైదానంలో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా బ్రేక్‌ దబియర్డ్‌ సవాలుపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ఈ సవాలును తాను స్వీకరించలేనని తెలుపుతూ రోహిత్‌, జడేజాని క్షమాపణలు కోరాడు. మీ కొత్త లుక్‌ నచ్చినప్పటికీ బ్రేక్‌ దబియర్డ్‌ సవాలును స్వీకరించేందుకు సిద్ధంగా లేను అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు.
అనంతరం అభిమానులు సవాలును స్వీకరించమని కొందరు, వద్దని మరి కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏమనంటే ‘ బ్రేక్‌ దబియర్డ్‌ సవాలును స్వీకరించవద్దని’. స్పందించిన కోహ్లీ ఓకే అని కూడా చెప్పాడు.