crime Featured

అమెరికాలో ఎన్ఆర్ఐ దంపతుల్ని చంపిదెవరంటే..?

 

 

 

 

 

 

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతికి చెందిన నరేన్‌ ప్రభు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నరేన్‌ కుమార్తె ఓ యువకుడితో డేటింగ్‌ చేసి గతేడాది విడిపోయింది. దీనికి ప్రతీకారంగా ఆ యువకుడు ఆమె తల్లిదండ్రులను కాల్చి చంపాడు.

శాన్‌జోస్‌లో నివాసముంటున్న నరేన్‌ సిలికాన్‌ వ్యాలీలో టెక్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. నరేన్‌ కుమార్తె, మీర్జా టాట్లిక్‌ కొంతకాలంగా డేటింగ్‌లో ఉండి అభిప్రాయభేదాలు తలెత్తడంతో గత ఏడాది విడిపోయారు. అప్పటినుంచి కోపంతో ఉన్న టాట్లిక్‌ ప్రేయసి ఇంటికి వెళ్లి ఆమె తండ్రి నరేన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం అతడి భార్య, 13ఏళ్ల కుమారుడిని బందీలుగా చేసుకున్నాడు. నరేన్‌ పెద్ద కుమారుడు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని టాట్లిక్‌ ఉన్న గదిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో నిందితుడు నరేన్‌ భార్యను కూడా చంపి చిన్న కొడుకును వదిలేశాడు. అయితే లొంగిపోయేందుకు అతడు నిరాకరించాడు. పోలీసుల కాల్పుల్లో టాట్లిక్‌ చనిపోయాడు. నేరచరిత్ర ఉన్న టాట్లిక్‌ ప్రేయసిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్యలు చేశాడని పోలీసులు భావిస్తున్నారు.