Latest News

అమ్మాయిలతో పోలీసోడుచిందులు

 

 

 

 

 

 

ఉత్తరప్రదేశ్‌లో ఒక పోలీసు తాగి తందనాలు ఆడుతూ బుక్కయ్యాడు. శ్రావస్తి జిల్లాలో అమ్మాయిల డాన్సు ఏర్పాటు చేశారు. అందులో బార్ గల్స్‌తో ఆ పోలీసు డాన్సు చేస్తూ, వాళ్ల మీదకు నోట్లు విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అందులోనూ అతగాడు యూనిఫాంలో ఉండే ఇదంతా చేశాడు.

శ్రావస్తి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి అతడు విధి నిర్వహణ కోసం వెళ్లాడని, తీరా అక్కడ వరకు వెళ్లిన తర్వాత తాగేసి బార్ గరల్స్‌తో డాన్సులు చేశాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇటీవలి కాలంలో అధికారుల పనితీరుపై తీవ్రంగా స్పందిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరి ఈ తాగుబోతు పోలీస్ పై ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి.