Sports

ఆటోగ్రాఫ్ తో మ్యాచ్ ఆగిందోచ్…


క్రికెటర్లను చూస్తే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. కళ్లముందు వాళ్లు ఉంటే కలవాలని ప్రయత్నిస్తుంటారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడైతే వారిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు అభిమానులు ఒక్కోసారి హ‌ద్దులు దాటుతుంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ ల‌యన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే ఓ అభిమాని గ్రౌండ్‌లోకి వ‌చ్చాడు. ఆటోగ్రాఫ్ ప్లీజ్‌.. అంటూ రైనా ముందు మోకాళ్ల‌పై కూర్చున్నాడు. దీంతో కొంత‌సేపు మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగింది. చివ‌రికి రైనానే ఎలాగోలా ఆ అభిమానికి స‌ర్ది చెప్పి గ్రౌండ్ బ‌య‌ట‌కు పంపించాడు.