Sports

ఆర్నెళ్లుగా క్రికెట‌ర్లకు జీతాల్లేవ్!

ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఈ సీజ‌న్‌లో తిరుగులేని స‌క్సెస్ సాధించింది. ఆడిన ప్ర‌తి టెస్ట్ సిరీస్‌నూ గెలుచుకుంది. న్యూజిలాండ్‌తో మొద‌లుపెడితే ఆస్ట్రేలియా వ‌ర‌కు విజ‌య ప‌రంప‌రం కొన‌సాగించింది. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన బీసీసీఐ కోహ్లి సేన‌కు న‌జ‌రానాలు కూడా ప్ర‌క‌టించింది. తీరా చూస్తే ఆర్నెళ్లుగా అస‌లు మ్యాచ్ ఫీజే అంద‌లేదు. ఆదాయ పంపిణీలో ప్ర‌స్తుతం బీసీసీఐకి, ఐసీసీకి మ‌ధ్య న‌డుస్తున్న వార్ కూడా దీనికి ఓ కార‌ణమ‌ని తెలుస్తున్న‌ది. టెస్ట్ ఆడిన త‌ర్వాత 15 నుంచి నెల రోజుల్లో మ్యాచ్ ఫీజులు చెల్లించేస్తారు. కానీ ఈసారి మాత్రం చాలా ఆల‌స్య‌మైంది.

కొత్త ప్లేయ‌ర్స్ కాంట్రాక్ట్ ప్ర‌కారం.. ఓ ప్లేయ‌ర్ టెస్ట్ ఆడితే రూ.15 ల‌క్ష‌లు, వ‌న్డేకు రూ.6 ల‌క్ష‌లు, టీ20కి రూ.3 ల‌క్ష‌లు ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రోవైపు మ‌హిళ‌ల జ‌ట్టుకు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాపై గెలిచినందుకు బోర్డు ప్ర‌క‌టించిన న‌జ‌రానాలు కూడా ఇంకా ప్లేయ‌ర్స్‌కు అంద‌లేదు. దీనికింద ఒక్కో ప్లేయ‌ర్‌కు రూ.కోటి అందాల్సి ఉంది. సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ప్ర‌స్తుతం బోర్డు ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్న‌ది. వాళ్ల అనుమ‌తి లేనిదే ఒక్క రూపాయి కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు.