Featured2 Movies

ఆర్ అంటే రకుల్ టీచర్..!

టాలీవుడ్  బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టీచర్ అవతారమెత్తింది. మంచు లక్ష్మీ స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్ పాఠాలను బోధించింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించింది. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్ళింది. హైదరాబాద్ లోని 25 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం.