Movies

ఆ మూవీ పేరు విని మోదీ నవ్వేశారు…

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్‌ ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా’లో నటిస్తున్నారు. మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’ క్యాంపెయిన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అక్షయ్‌.. మోదీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్‌ తన సినిమా టైటిల్‌ గురించి చెప్పగానే మోదీ నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ విషయాన్ని అక్షయ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు.