crime Featured Featured2

ఆ మెయిల్ ఓపెన్ చేశారంటే…

 

 

 

 

 

 

 

 

జీమెయిల్‌ వాడుతున్నారా? ఎవరి నుంచైనా గూగుల్‌ డాక్‌ ఫైళ్లను మీకు షేర్‌ చేసినట్లు ఈమెయిల్‌ వచ్చిందా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మెయిల్‌ తెరవకండి. వెంటనే ఇన్‌బాక్స్‌ నుంచి ఆ మెయిళ్లను డిలీట్‌ చేయడం మేలు. ఎందుకంటే ఇప్పుడు జీమెయిల్‌ ఖాతాలపై హ్యాకర్లు కొత్తరకం దాడులకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమైన ఫైళ్లు పంపినట్లుగా జీమెయిల్‌ ఖాతాదారులను నమ్మిస్తూ వారి ఖాతాలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని నిపుణులు గుర్తించారు.

‘ఫలానా వ్యక్తి ఈ ఫైల్‌ను షేర్‌ చేశాడు. ఆ ఫైల్‌ను గూగుల్‌ డాక్స్‌లో ఓపెన్‌ చేయండి’’ అంటూ హ్యాకర్లు లింకును పంపిస్తారు. ఆ లింకును క్లిక్‌ చేస్తే ‘అనుమతించు’ అనే బటన్‌ వస్తుంది. ఆ బటన్‌ను నొక్కితే చాలు.. మన గూగుల్‌ ఖాతాను పూర్తిగా హ్యాకర్ల వాడుకునే వీలుంటుందట. అంతేకాదు.. మన కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరికీ మన పేరుతోనే ఆ ప్రమాదకర ఈమెయిల్‌ వెళ్తుందట. దాంతో ఇతరులు కూడా హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
జీమెయిల్‌ ఖాతాదారులను కంగారుపెడుతున్న ఈ కొత్తరకం దాడుల విషయంపై గూగుల్‌ స్పందించింది. గూగుల్‌ డాక్స్‌ రూపంలో వస్తున్న నకిలీ ఈమెయిళ్లపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. అలాంటి లింకులను క్లిక్‌ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని ట్విటర్‌లో సూచించింది.
తెలిసీతెలియక ఇప్పటికే ఎవరైనా అలాంటి లింకులను క్లిక్‌ చేసినా.. గూగుల్‌ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఖాతాకు ఏఏ యాప్‌లు అనుసంధానమై ఉన్నాయో చూసుకోవాలి. అందుకోసం గూగుల్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యి.. ‘సెక్యూరిటీ అండ్‌ కనెక్టెడ్‌ యాప్స్‌’ అనే ట్యాబ్‌ క్లిక్‌ చేయాలి. అందులో ‘గూగుల్‌ డాక్స్‌’ కనిపిస్తే తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.