Social

ఆ రెండూ భయపడ్డాయ్..ఎందుకంటే…

సింహాం, ఏనుగుల్ని చూస్తే భయపోడితాం.జంతువులైతే జాడలేకుండా పోతాయ్. కానీ సీన్ రివర్స్. బర్రె దూడ గజరాజును తరిమికొడితే …అడవి రారాజు సింహాన్ని ఓ నీటి బుడగ భయపెట్టింది. అడవిలో అల్లాడించే ఇవి ఎందుకు భయపడ్డావో తెలుసుకోవాలంటే…
దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ జాతీయ పార్కులో ఓ గేదె, తన దూడతో కలిసి వెళుతుంటే వాటిని అనుసరిస్తూ వెనుకే ఏనుగు వెళ్తొంది. ఏనుగు తమపై దాడి చేసేందుకు వస్తోందని పొరపడిన దూడ దానికి ఎదురు నిలిచింది. దాంతో ఏనుగు పక్కకు తిరిగి వెళ్లిపోయింది. అదే సమయంలో ఆండ్రూ కోహెన్‌ అనే ఆర్థిక సలహాదారుడు పార్క్‌లో ఓ వాహనంలో ఉన్నారు. ఈ దృశ్యాన్ని ఆయన వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.ఆ ఏనుగు తిరిగి దూడను తొండంతో కొట్టే సామర్థ్యం ఉన్నా చిన్న పిల్ల కదా అని వదిలేసిందని అంటున్నాడు ఆండ్రూ. వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి.
ఇక సింహం అడవికే రారాజు. దానికి కోపమొచ్చిందంటే ఎంతటి జంతువైనా, మనుషులైనా భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిందే. అందరికీ వణుకు పుట్టించే సింహామే భయపడింది. బ్రిటన్‌లోని ప్యారడైజ్ జంతుసంరక్షణ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఊదిన నీటి బుడగ మోటో (సింహం పేరు)వైపు వచ్చింది. సింహం నీటి బుడగను ఫాలో అవుతుండగా అది టపీమనీ పగిలిపోయింది. నీటిబుడగ పగిలిన వెంటనే ఉలిక్కిపడిన సింహం వెంటనే పక్కకి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్‌ అవుతోంది.