Health

ఇవి తింటే కొవ్వు కరగాల్సిందే..!

కడుపు నిండా తిన్నా, శరీరం బరువు, మధుమేహం నియంత్రణలో ఉండగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఈ కోరిక తీరడం అసాధ్యమేమీ కాదనేందుకు ఇవిగో కొన్ని ఆధారాలు. బ్రిటన్‌కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు, ఎలుకల మీద జరిగిపన కొన్ని పరిశోధనల్లో ఈ నిజాన్ని రుజువు చేశారు. మనం తినే ఆహారంలోపి పీచుపదార్థాల్లో కొన్ని జీర్ణం కాకుండానే విసర్జనలో వెళ్లిపోతే మరికొన్నేమో పూర్తిగా జీర్ణమై పెద్దపేగుల్లోని షుగర్‌ను కొవ్వు పదార్థాలను బయటకు పంపేస్తాయి. అలాంటి పీచుపదార్థాలున్న 6 రకాల ఆహార పదార్థాలను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. వాటిలో ఓట్లు, ఆర్టిచోక్స్‌, పుట్టగొడుగులు, శతమూలి (పిల్లితీగెలు) అరటి పండ్లు, ఉల్లి ఉన్నాయి. ఇవి ఆకలిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడ ం వల్ల కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. పైగా హానికారకమైన కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. స్థూలకాయులైన స్త్రీల మీద జరిపిన పరిశోధనలో వారిలో మధుమేహాన్ని, గుండె జబ్బల్ని, క్నొన రకాల కేన్సర్లను కలిగించే కొవ్వు పదార్థాలు ఉన్నట్లు స్పష్టమయ్యింది. అలాంటి వారికి ఈ 6 రకాల ఆహార పదార్థాలను ఇస్తే, మధుమేహ నియంత్రణ తో పాటు గుండె జబ్బుల్ని, కేన్సర్లను అధిగమించడం సులువవుతుందంటున్నారు.