Featured Latest News

ఈఎంఐలు కట్టలేక బెంజ్ అమ్మేశా!


ఖరీదైన కార్ల అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్ ‘గతంలో నాకు బెంజ్‌కారు ఉండేది.. వాయిదాలు కట్టలేక అమ్మేశా’ అని చెప్పారు. అయితే రోడ్ ప్రమాదంలో చనిపోయిన నిషిత్ నారాయణ కు అమ్మింది ఇదే కారు.ఎంతో ముచ్చటపడి కల్యాణ్ కొన్న ఈ కారును 2016 లో మంత్రి నారాయణ వాళ్లకు అమ్మాడు. అమ్మిన తర్వాత కాన్సిల్ చేసకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పినా… కొడుకు నిషిత్ ఒత్తిడితో నారాయణే ఉంచుకున్నాడు.
గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హిందీ భాషకు చాలా ప్రాధాన్యత ఇస్తా. నా సినిమా ఖుషీలో కూడా ‘ఏ మేరా…’ అనే హిందీ పాట కూడా ఉంది. ఉత్తరాదివారి మాదిరిగానే దక్షిణాది వారికీ అవకాశాలు కల్పించాలి. అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నియామకానికి నేను వ్యతిరేకం కాదు. ఉత్తరాదిలో కూడా దక్షిణాది వారికీ అదే ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పా. అహ్మదాబాద్‌లో మోదీని కలిసినప్పుడు కూడా ఉత్తరాది, దక్షిణాది అంశాలను చెప్పా. దక్షిణాది వారి పట్ల చిన్నచూపు చూస్తున్న అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లా. దేశం ఒక్కటిగా కలిసి ఉండాలని కోరుకునేవారు సమస్యలపై గొంతెత్తాలి. దేశ సమగ్రత దెబ్బతినకూడదు. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసేందుకు ఎవరికైనా హక్కుంది. న్యాయం జరగనప్పుడు గొంతెత్తే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది. ప్రజాసమస్యలపై గొంతెత్తే వేదిక ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌. శాంతియుతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవటం సరికాదు. ధర్నాచౌక్‌ కోసం జరుగుతున్న పోరాటానికి జనసేన మద్దతిస్తుంది. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన రైతులను అరెస్టు చేయడం సరికాదు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ప్రజల తరఫున ఉంటా’’ అని పవన్‌ స్పష్టం చేశారు.