Latest News

ఈ సాహసాన్ని చూసే దమ్ము ఉందా..?

అది మామూలు సాహసం కాదు..ఆ సాహసకృత్యం చూసే వారికి ఒళ్లు జలదరించక మానదు. సముద్రంలో కొండల మధ్య తాడుకట్టుకొని దానిపై నడవమంటే వామ్మో..
అలాంటిది ఉహించుకుంటే దడ పుడుతుంది. మరి నిజంగా చూస్తే…

లూకా ఇర్మ్‌లర్‌ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి రెండు కర్రల మధ్య కట్టిన తాడుపై బ్యాలెన్స్‌ చేసుకుంటూ నడవటం నేర్చుకున్నాడు. అదే సాహస కృత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి వారిని మనం రోడ్లపై చూస్తుంటాం. అయితే, రెండు కర్రలకు బదులు ఎత్తైన రెండు రాతి కొండలు.. అదీ పసిఫిక్‌ మహా సముద్రంలో.. 1300 అడుగుల ఎత్తులో.. దట్టంగా గాలులు వీచే ప్రాంతంలో ఈ విన్యాసం చేయడం.. వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదూ! అయినా అసాధ్యం అనుకున్న ఈ సాహసాన్ని చేసి చూపించాడు లూకా. తస్మానియా ప్రాంతంలోని ఓ ద్వీపంలో ఈ సాహసకృత్యాన్ని లూకా ప్రదర్శించాడు. ఓ సమయంలో బ్యాలెన్స్‌ తప్పి కింద కూడా పడబోయాడు. 400 మీటర్ల ఎత్తులో సముద్రంపై వేగంగా గాలులు వీస్తున్నా.. బ్యాలెన్స్‌ తప్పకుండా ఆ కొండ నుంచి ఈ కొండకు తాడుపై నడుచుకుంటూ విజయవంతంగా చేరుకున్నాడు.