Featured Politics

ఉత్తరాది ఐఏఎస్ ని టీటీడీ ఈవో ఎలా చేస్తారు..ప్రశ్నించిన పవన్..

 

 

 

 

 

 

 

 

 

 

టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్ నియామకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సీరియస్ గా రియాక్టయ్యారు. టీటీడీ ఈవోగా ఉత్తారాదికి చెందిన సింఘాల్ నియామకాన్ని నేను వ్యతికరేఖించడం లేదు, కాని ఉత్తరాదిలోని అమర్ నాథ్, వారణాసి, మధురలోని ఆలయాలలో దకిణాది ఐఏఎస్ లకు ఈవో లుగా అనుమతినిస్తారా.. అస్సలు అలా జరగదు. మరి అలాంటప్పుడు ఉత్తరాది ఐఏఎస్ ని ఇక్కడ ఎలా ఎంపిక చేస్తారు అని పవన్ ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుకు వెళ్తానని చెప్పారు.