Featured Politics Social

ఐపీఎస్ ఆఫీసర్ కంటతడి..ఎందుకంటే…

 

 

 

 

 

 

 

 

 

నేను నీతో మాట్లాడటం లేదు. నాకు ఏమీ చెప్పొద్దు. కామ్‌గా ఉండు. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉండు.. ఐపీఎస్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చాడు. ఎమ్మెల్యే తిట్లతో మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీస‌ర్ షాక్ తింది. అవమానభారంతో వలవల ఏడ్చేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కోయిల్వా గ్రామంలో అక్ర‌మంగా మ‌ద్యం దుకాణాన్ని న‌డిపిస్తున్నారంటూ మ‌హిళ‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో లాఠీచార్జి కూడా జ‌రిగింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న స‌మ‌యంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధామోహ‌న్ దాస్ అగ‌ర్వాల్ అక్క‌డికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీస‌ర్ చారు నిగ‌మ్‌ను ఆయ‌న తిట్టారు.

ప‌దేప‌దే ఆమె వైపు వేలెత్తి చూపుతూ.. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. నేను నీతో మాట్లాడటం లేదు. నాకు ఏమీ చెప్పొద్దు. కామ్‌గా ఉండు. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉండు అంటూ ఆ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. తాను ఇక్క‌డ ఇన్‌చార్జ్ కాద‌ని, ఏం చేస్తున్నానో త‌న‌కు తెలుస‌ని ఆమె బ‌దులిచ్చింది. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అక్క‌డికి చేరుకున్నారు. అప్ప‌టికే ఎమ్మెల్యే వార్నింగ్‌తో చారు నిగ‌మ్ కంట‌త‌డి పెట్టుకుంది. దీనిని అక్క‌డున్న వాళ్లు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టారు. అయితే తాను స‌ద‌రు అధికారితో త‌ప్పుగా ఏమీ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని ఎమ్మెల్యే రాధామోహ‌న్ దాస్ అన్నారు. మ‌ద్యం దుకాణాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా ధ‌ర్నా చేస్తున్న‌వారితో పోలీసులే దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆయ‌న ఆరోపించారు.