Featured Social

ఎమ్మెల్యే వెడ్స్ కలెక్టర్

 

 

 

 

 

 

 

 

 

అతను లీడర్.. ఆమె ఓ ఐఏఎస్.ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. త్వరలో ఏడాడుగులు వేసేందుకు రెడీ అయ్యారు.

కేరళ మాజీ స్పీకర్ కార్తికేయన్ తనయుడు కేఎస్ శబరినాథన్ గత ఎన్నికల్లో అరువిక్కర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన ఫేస్‌బుక్ పేజీలో రిలేషన్ షిప్ స్టేటస్ కమిటెడ్ అని రాసి తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

దీంతో కొన్నేళ్లుగా వీరిద్దరిపై వస్తున్న వదంతులకు సబరినందన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ‘నాకు కావలసిన వ్యక్తులు కొన్ని రోజులుగా పెళ్లి గురించి అడుగుతున్నారు. వారికి ఇదే నా సమాధానం. ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సబ్ కలెక్టర్ దివ్యను తిరువనంతపురంలో కలుసుకున్నాను. మా ఇద్దరి ఆశయాలు, ఉద్దేశాలు, ఆలోచనా దృక్పథం ఒకటే కావడంతో మా పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజుల్లో ఆమె నా భాగస్వామి కానుంది. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను’ అని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఎమ్మెల్యే శబరినాథన్ చెప్పారు.

దివ్య ఎస్ అయ్యార్ వెల్లూరులోని సీఎంసీ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. సివిల్స్ కు ప్రిపేర్ అయిన దివ్య 2013లో సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. తొలుత కొట్టాయమ్‌ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆమె ప్రస్తుతం తన సొంత జిల్లా తిరువనంతపురం సబ్ కలెక్టర్‌గా చేస్తున్నారు. సబరినందన్ పోస్టుపై మీడియా ఆమెను స్పందించగా.. మాకు అందరి ఆశీస్సులు కావాలి అంటూ పెళ్లి వార్తను కన్ఫామ్ చేశారు. ఎమ్మెల్యేతో పరిచయం ప్రేమగా మారిందన్నారు. వచ్చే నెలలో వీరి వివాహం జరగనుంది.