crime Latest News

ఎయిర్ బ్యాగ్ లు ఎందుకు కాపాడలేకపోయాయి..?

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో చనిపోయిన మంత్రి నారాయణ కొడుకు కారు ప్రమాదం ఘటనకు సంబంధించి ఒక్కో విషయం బయటకువస్తోంది. తెల్లవారుజామున 2.41 నిమిషాలకు మెట్రో పిల్లర్‌ను కారు ఢీ కొన్నట్లు సీసీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. దాదాపు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా మెట్రో పిల్లర్‌ని బెంజ్‌కారు ఢీకొట్టినట్టు అక్కడ స్పీడోమీటర్‌లో కనిపిస్తోంది. పిల్లర్ల పక్కనుంచి వాహనాన్ని అత్యంత వేగంగా నడపడం కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. పైగా సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. వాహనంలో దొరికిన మద్యం బాటిళ్లు పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రెండు విషయాలు.. మితిమీరిన వేగం, మద్యం తాగిన వాహనం నడపడం కూడా! వాహన ప్రమాదాన్ని పరిశీలించిన నిపుణులకు కారు ఫ్రంట్ పార్ట్ కనిపించలేదని, ఇంజన్ తునాతునకలైపోయిందన్నారు. ఈ తరహా కార్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు.
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బెంజ్‌ జి-63 కారు నుజ్జునుజ్జైపోయింది. సాధారణంగా బెంజ్‌లో అత్యున్నత శ్రేణికి చెందిన ఏఎంజీ సిరీస్‌ కార్లకు రక్షణ ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా నిశిత్‌, రాజాల ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాద తీవ్రతకు ఇంజిన్‌ భాగాలు మొత్తం మెలితిరిగిపోయాయి. దీంతో కారులో నుంచి వెలికి తీసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
వీరి మృతిపై అపోలో ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్యుడు సురేందర్‌రెడ్డి వైద్య నివేదిక ఇచ్చారు. ‘అతివేగంతో పిల్లర్‌ను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారు. నిశీత్‌, రవిచంద్ర మద్యం సేవించలేదు. బలమైన దెబ్బలు తగలడంతోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నిశీత్‌ ఛాతికి స్టీరింగ్‌ బలంగా తాకింది. నిశీత్‌ వూరిపితిత్తులు దెబ్బతిన్నాయి. లివర్‌ ముక్కలైంది’ అని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశీత్‌ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశీత్‌ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం అంబులెన్స్‌లో బంధువులు మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. నిశీత్‌ తండ్రి నారాయణ లండన్‌ నుంచి బయలుదేరారని.. ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని బంధువులు చెబుతున్నారు. గురువారం నారాయణ కళాశాల క్యాంపస్‌లో నిశీత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.
ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.శ్రీనివాస్‌, తెలంగాణ తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌.రమణ తదితరులు అపోలో ఆస్పత్రిలో నిశీత్‌ మృతదేహానికి నివాళులర్పించారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో చనిపోయిన మంత్రి నారాయణ కొడుకు కారు ప్రమాదం ఘటనకు సంబంధించి ఒక్కో విషయం బయటకువస్తోంది. తెల్లవారుజామున 2.41 నిమిషాలకు మెట్రో పిల్లర్‌ను కారు ఢీ కొన్నట్లు సీసీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. దాదాపు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా మెట్రో పిల్లర్‌ని బెంజ్‌కారు ఢీకొట్టినట్టు అక్కడ స్పీడోమీటర్‌లో కనిపిస్తోంది. పిల్లర్ల పక్కనుంచి వాహనాన్ని అత్యంత వేగంగా నడపడం కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. పైగా సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. వాహనంలో దొరికిన మద్యం బాటిళ్లు పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రెండు విషయాలు.. మితిమీరిన వేగం, మద్యం తాగిన వాహనం నడపడం కూడా! వాహన ప్రమాదాన్ని పరిశీలించిన నిపుణులకు కారు ఫ్రంట్ పార్ట్ కనిపించలేదని, ఇంజన్ తునాతునకలైపోయిందన్నారు. ఈ తరహా కార్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు.
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బెంజ్‌ జి-63 కారు నుజ్జునుజ్జైపోయింది. సాధారణంగా బెంజ్‌లో అత్యున్నత శ్రేణికి చెందిన ఏఎంజీ సిరీస్‌ కార్లకు రక్షణ ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా నిశిత్‌, రాజాల ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాద తీవ్రతకు ఇంజిన్‌ భాగాలు మొత్తం మెలితిరిగిపోయాయి. దీంతో కారులో నుంచి వెలికి తీసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
వీరి మృతిపై అపోలో ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్యుడు సురేందర్‌రెడ్డి వైద్య నివేదిక ఇచ్చారు. ‘అతివేగంతో పిల్లర్‌ను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారు. నిశీత్‌, రవిచంద్ర మద్యం సేవించలేదు. బలమైన దెబ్బలు తగలడంతోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నిశీత్‌ ఛాతికి స్టీరింగ్‌ బలంగా తాకింది. నిశీత్‌ వూరిపితిత్తులు దెబ్బతిన్నాయి. లివర్‌ ముక్కలైంది’ అని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశీత్‌ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశీత్‌ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం అంబులెన్స్‌లో బంధువులు మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. నిశీత్‌ తండ్రి నారాయణ లండన్‌ నుంచి బయలుదేరారని.. ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని బంధువులు చెబుతున్నారు. గురువారం నారాయణ కళాశాల క్యాంపస్‌లో నిశీత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చె