Featured Latest News

ఎస్‌బీఐ మరో షాక్‌! డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు

ఎస్ బీ ఐ ఖాతాదారులకు మరో షాకింగ్ న్యూస్. డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గించింది. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను మరింత తగ్గిస్తూ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. తగ్గించిన వడ్డీరేట్లు మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్లలతో పాటు రూ.కోటి వరకూ ఉండే వాటిపై అమలుకానుంది.
తాజా వడ్డీ రేట్ల ప్రకారం రెండేళ్ల కన్నా తక్కువ కాకుండా మూడేళ్లలోపు ఉండే డిపాజిట్లపై 6.25శాతం వడ్డీని అందించనుంది. ఇంతకు ముందు ఇది 6.75శాతం ఉండేంది. అదే విధంగా సీనియర్‌ సిటిజన్లకు ప్రస్తుతం ఇస్తున్న 7.25శాతం వడ్డీని 6.75శాతానికి తగ్గించింది. మూడేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఉండే డిపాజిట్లపై 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించిన ఎస్‌బీఐ 6.50శాతం వడ్డీని ఇస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 29 నుంచి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఏడు రోజుల నుంచి రెండేళ్ల కాలావధి కలిగిన డిపాజిట్లపై వడ్డీలో ఎలాంటి మార్పూ లేదు. ఏడాది కాలం నుంచి 455 రోజుల మధ్య చేసే డిపాజిట్లపై 6.90శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది.