Featured Latest News Social

ఎస్ బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు..!

ఖాతదారులకు ఎస్ బీఐ శుభవార్త అందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది.

అంతేకాక, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తామని తెలిపింది. చివరకు మినమమ్ బ్యాలెన్స్ నుంచి ఖాతాల్ని మినహాయిస్తున్నట్టు స్పష్టంతో ఖాతాదారులు ఊపీరిపీల్చుకున్నారు.