Latest News

ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకరమ్మ


తమ టీవీ ఛానెల్‌ మూతపడిందని తెలిసి ఓ యాంకర్‌ ఏడుస్తూనే న్యూస్ బులెటెన్ చదివింది. ఇజ్రాయిల్‌కి చెందిన గ్యులా ఈవెన్‌ ఛానెల్‌ 1 అనే వార్తా సంస్థలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈ ఛానెల్‌ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్‌. దీనికి దాదాపు 49 ఏళ్ల చరిత్ర ఉంది. కొన్ని రాజకీయ వివాదాల కారణంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు ఈ ఛానెల్‌ మూసేయాలని ఆదేశించారు.
గ్యులా వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ విషయం ఆమెకి తెలిసింది. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది. నేతన్యాహు మీడియా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.