Featured Featured2

ఓయూ వందేళ్ల పండుగ షురూ

 

 

 

 

 

 

 

 

 
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జ్యోతి ప్రజల్వన చేసి శతాబ్ది వేడుకలను ప్రారంభించారు. వేదికపై రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఓయూ వీసీ రామచంద్రం, మేయర్ బొంతురామ్మోహన్ ఆశీనులయ్యారు. శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి రాష్ట్రపతి కీలక ప్రసంగం చేశారు. దేశానికి ఉస్మానియా యూనివర్సిటీ గర్వకారణమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత విశ్వవిద్యాలయమని కొనియాడారు. ఓయూ శతాబ్ది వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి.. ఓయూ ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఒక విజన్‌తో ఓయూ ప్రారంభమైందన్నారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలోనూ అనేక మార్పులు చూశానని ప్రణబ్ చెప్పారు.
ఈ వేడుకల్లో ఓయూ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శతాబ్ది వేడుకల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఎన్ సీ గేటు నుంచి తార్నాక వరకు ఉస్మానియా వర్సిటీ విశిష్టతను తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. శతాబ్ది వేడుకల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.