Featured2 Latest News

కంటైనర్‌ బోల్తా పడిందోచ్

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌  లో  కంటైనర్‌ బోల్తా పడింది. బిస్కెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ మలుపు దగ్గర అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.. మాసబ్‌ట్యాంక్‌ నుంచి లక్డీకాపూల్‌ వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న మలుపు దగ్గర ఈ ఘటన జరిగింది.డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.