crime Latest News

కిక్కులో చుక్కలు చూపించారు!

మద్యం మత్తులో ఇద్దరు యువతులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. రెండుసార్లు సిగ్నల్ జంప్ చేసిన వాళ్లని
ప్రశ్నిస్తే ఓ పోలీసును కొట్టారు. యూనిఫామ్‌ని చించేసి రచ్చరచ్చ చేశారు. చండీ గఢ్ లోని ఇద్దరు యువతులు సోమవారం సాయంత్రం రోడ్డుపై వేగంగా దూసుకెళ్లారు. డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరు యువతులు సిగ్నల్ జంప్ చేశారు. పోలీసులు సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో వాళ్లని పోలీసులు వెంబడించి అడ్డగించారు.. ఐతే, ట్రాఫిక్‌‌లో కారు ఇరుక్కుపోవడంతో అడ్డంగా దొరికిపోయారు.
అమ్మాయిలే కదా ఏదోరకంగా సర్దిచెప్పి పంపాలని భావించిన పోలీసులకు ఊహించని షాకిచ్చారు. ఓ యువతి కారులోనుంచి బీర్ బాటిల్ తీసుకొచ్చి నెత్తిన పగల గొట్టుకుని, పోలీసుపై చేయి చేసుకుని యూనిఫామ్ చించేసింది. పక్కనున్నవాళ్లు చెబుతున్న ఇద్దరు పోలీసులపైకి దూసుకెళ్లారు. చీకటిపడడంతో మరుసటి రోజు వాళ్లని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియాను చూడాలంటే కింది లింక్ క్లిక్ చేయాలి