Featured2 Politics

కూలీ నెం.1… కేటీఆర్ ఐస్ క్రీమ్ 5లక్షలు..!

టీఆర్ఎస్‌ కూలీ దినాల్లో భాగంగా మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్‌ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. వరంగల్‌ బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ ఐస్‌ క్రీమ్‌ అమ్మారు.

అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్‌ జ్యూస్‌, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఆనంతరం అక్కడి బస్తీవాసులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను, ప్రజలను కోరారు.