Featured Politics

కేజ్రీ లంచావతార్ అవునా..కాదా..నిగ్గుతేలేనా..

 

 

 

 

 

 

 

 

 

 

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చిక్కుల్లో పడ్డారు. సహచర కేబినెట్ మంత్రుల ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఢిల్లీ సర్కార్ సారథిని షేక్ చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అవినీతినిరోధక శాఖను ఆదేశించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని స్పష్టం చేశారు.

తన మంత్రివర్గ సహచరుడు, ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ నుంచి సీఎం కేజ్రీవాల్‌ రూ. 2కోట్లు లంచం తీసుకున్నారని ఇటీవల ఉద్వాసనకు గురైన ఢిల్లీ జల మంత్రి కపిల్‌ మిశ్రా ఆరోపించారు. మంత్రివర్గ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదంటూ కపిల్‌ మిశ్రాను శనివారం మంత్రివర్గం నుంచి తప్పించారు. అయితే ఉద్వాసనకు గురైన అనంతరం కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేశారు మిశ్రా. ‘ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం నా కళ్ల ముందే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి రూ.2కోట్లు లంచం తీసుకున్నారు. కేజ్రీవాల్‌ బంధువుల కోసం రూ.50కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించినట్లు జైన్‌ నాతో చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి’ అని ప్రకటించారు. ఈ విషయంపై మిశ్రా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ఫిర్యాదు చేయడంతో.. విచారణకు ఆదేశించారు.