Latest News Politics

కేరళ సర్కార్ పై సుప్రీం కన్నెర్ర..

 

 

 

 

 

 

 

 

 

కేరళ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మండిపడింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసు కూడా జారీచేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ గట్టిగా ప్రశ్నించింది. సోమవారంలోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పినరయి విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టులో నియమించగా, దానిపై ఆయన కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సేన్‌కుమార్‌ను మళ్లీ డీజీపీగా నియమించాలని చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంకా సేన్‌కుమార్‌ను డీజీపీ చేయకుండా ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూనే ఉంది. దాంతో కొన్నాళ్లు వేచి చూసిన ఆయన.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో తాము చెప్పినా కూడా ఎందుకు ఆయనను డీజీపీ పదవిలో నియమించలేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.