Featured Featured2 Sports

ఐపీఎల్ 10లో కోహ్లీ ఆట కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చేస్తున్నాడు. కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ముంబై తో సమరానికి సై అంటున్నాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా కోహ్లీ భుజానికి గాయమైంది. దీంతో అతను నాలుగో టెస్టులో ఆడలేదు. ఐపీఎల్‌లోనూ తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో జిమ్‌లో బరువులెత్తుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంటూ… ‘మళ్లీ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడతానా అని ఆత్రుతగా ఉంది. దాదాపుగా సిద్ధమైనట్లే. ఏప్రిల్‌ 14..?’ అని కోహ్లీ వెల్లడించాడు.. ఈ క్రమంలో గురువారం ఐపీఎల్‌ నిర్వాహకులు భారత క్రికెట్‌ జట్టు సారథి, ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడంటూ పేర్కొంది. ఈ ప్రకటనతో కోహ్లీ శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చేసినట్లు తెలిసిపోయింది. .

కోహ్లీ రాకతో ఐపీఎల్ 10 సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో నెట్టుకోస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ బూస్ట్ దొరికింది. ఇప్పటి వరకు బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇక బెంగళూరు వేదికగా శుక్రవారం ఆర్‌సీబీ.. ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.