Sports

“కోహ్లీ మోసం చేశాడు”

 

 

 

 

 

 

 

క్రికెట్ యాంకర్ అర్చనా విజయ చిరిగిన జీన్స్ ఫ్యాంట్ ని విరాట్ కోహ్లీ చూసిన ఫోటో నెట్ లో తెగ వైరల్ అయింది. కోహ్లీతో పాటు, అర్చ‌న మీద కూడా దారుణ‌మైన కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు నెటిజ‌న్లు. అయితే ఈ ఫోటోను ప్ర‌చారం చేసిన విధానంపై అర్చ‌న మాత్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విరాట్ కోహ్లీ కేవ‌లం కెమేరాల‌ను మోసం చేయ‌డానికి మాత్ర‌మే ప్ర‌య‌త్నించాడ‌నీ… కాని జ‌రిగింది మాత్రం వేర‌ని అంటోంది.

క‌్రికెట్ యాంక‌రింగ్‌లో అంద‌చందాలు, ఆక‌ట్టుకునే ప్ర‌శ్న‌ల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది అర్చ‌నా విజ‌య‌. ఈసారి ఐపీఎల్ సీజ‌న్‌కి కూడా మాంచి జోష్ తో వ‌చ్చిన ఆమెకు సడెన్ షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా అర్చ‌న విజ‌య మోకాళ్ల ద‌గ్గ‌ర చిరిగిన జీన్స్ ప్యాంటు వేసుకుంది. మాట‌ల సంద‌ర్భంలో కోహ్లీ అటు వైపే చూస్తున్న‌ట్టుగా వ‌చ్చిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో రచ్చ రచ్చకు దారితీసింది.

ఈ వైరల్ స్పందించిన అర్చనా విజయ “ఓరి దేవుడా… జనాలు హెడ్‌లైన్ల కోసం ఇంత‌ప‌నిచేస్తారా? లేక ప‌రువు తీయ‌డానికి ఇంత దారుణానికి దిగుతారా?” అని ప్ర‌శ్నించింది. “ఆ ఫోటో తీసిన స‌మ‌యంలో నేను కోహ్లీపై శ‌ర‌ప‌రంప‌ర‌గా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాను.. దీంతో అత‌డు దీనంగా నా ప్ర‌శ్న‌ల కార్డు వైపు చూస్తూ కెమేరాల‌ను మోసం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అతడు చూస్తున్న‌ది నా చేతిలో ఉన్న‌ క్యూ కార్డు వైపే త‌ప్ప‌ మ‌రోటి కాదు…” అని వివ‌ర‌ణ ఇచ్చింది. వాస్త‌వానికి కోహ్లీ చాలా మంచివాడ‌నీ… క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వాడ‌ని ప్ర‌శంసించింది. చాలా క‌లివిడిగా ఉంటూ సంతోషంగా ప‌ల‌క‌రిస్తాడ‌ని… మంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో టీమిండియాలో కెప్టెన్ స్థాయికి వెళ్లాడ‌ని అంటోంది. మ‌హిళ‌లను చూడ‌డంలో భార‌తీయుల్లో నెల‌కొన్న ఆలోచ‌నా విధానం మారాల‌ని హిత‌వు ప‌లికింది అర్చనా విజయ.