Latest News

గాల్లో కుదిపేసిన విమానం.. ప్రయాణికుల బొక్కలు సురుసుర్రు..!

మాస్కో నుంచి బ్యాంకాక్ వెళ్తోన్న విమానం ట‌ర్బోలెన్స్‌కు గురైంది. గాలిలోనే విమానం కుదిపేయ‌డంతో 27 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. ఎరోఫ్లాట్ ఫ్ల‌యిట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
ట‌ర్బోలెన్స్ తీవ్రంగా ఉన్న కార‌ణంగా ప్ర‌యాణికుల‌ ఎముక‌లు ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు తెలుస్తుంది. కొంద‌రు ప్ర‌యాణికుల‌కు ర‌క్తం వ‌చ్చేటట్లుగా దెబ్బ‌లు త‌గిలాయి. సువ‌ర్ణ‌భూమి ఎయిర్‌పోర్ట్‌ను చేరుకున్న క్ర‌మంలో విమానం ట‌ర్బోలెన్స్‌కు గురైంది. సీటు బెల్ట్ ధ‌రించ‌ని ప్ర‌యాణికుల‌కు గాయాలు మ‌రింత తీవ్రంగా అయిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో 30 మంది గాయ‌ప‌డిన‌ట్లు థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.