Featured Politics

గులాబీ గర్జనకు‘వాహనహారం’

 

 

తెలంగాణలో దారులన్ని వరంగల్ వైపే మళ్లాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు వాహనాలు పోటెత్తాయి. దార్లన్నీ జై తెలంగాణ నినాదాలతో మార్మోగాయి.బండెనక బండితో వాహనాలు మానవహారంలా వాహనహారాన్ని తలపించాయి. సైకిళ్లు మొదలుకొని ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, డీసీఎం వ్యాన్లు, బస్సులతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నుంచి వాహనాల ప్రయాణం నెమ్మదిగా కొనసాగింది. వాహనాలతో వరంగల్ హైవే కిక్కిరిసిపోయింది. రైతులు, ప్రజలు సభకు త్వరగా వెళ్లేలా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆలేరు – వరంగల్ మధ్య, ఖమ్మం – వరంగల్ మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడూ సమీక్షించిన పోలీసులు జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. వరంగల్ వైపు వెళ్లే రహదారులపై టీఆర్‌ఎస్ శ్రేణులు చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.