Featured Social

చిరిగిన నోట్లు తీసుకోవాల్సిందే..!

 

 

 

 

 

 

 

 

 

నోట్లు చిరిగితే.. పెన్ను రాతలు రాసిన నోట్లు ఉంటే.. బయట తీసుకోకపోతే బ్యాంకుల్లో మార్చేసుకుంటాం. కానీ డీమానిటైజేషన్ తర్వాత కొత్త 5వందలు,2 వేల నోట్స్ పై చిన్న పెన్సిల్ గీత ఉన్న బ్యాంకర్లు తీసుకోవడం లేదు. దీనిపై స్పందించిన ఆర్ బీ ఐ…చిరిగిపోయిన నోట్ల‌ను, పెన్ను రాత‌లు రాసి ఉన్న నోట్ల‌ను బ్యాంకుల్లో తిర‌స్క‌రించొద్ద‌ని, అలాంటి నోట్ల‌ను తీసుకోవాల‌ని బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది. చాలా బ్యాంకుల్లో ఇలాంటి నోట్లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో ఆర్బీఐ మరోసారి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వదంతులు చూసి, కొన్ని బ్యాంకులు చిరిగిపోయిన కొత్త 5వంద‌లు, 2వేల నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. ఇక బ్యాంకు ఉద్యోగులు నోట్ల‌పై రాత‌లు రాయ‌డాన్ని మానుకోవాల‌ని, చాలామందికి అదొక అల‌వాటుగా మారింద‌ని.. ఆర్బీఐ క్లియ‌ర్ నోట్ పాల‌సీకి అది వ్య‌తిరేక‌మ‌ని కేంద్ర బ్యాంకు స్ప‌ష్టం చేసింది.