Featured Movies

చిరుకు జోడీగాఐష్ లేదా బాలన్

 

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో చిరుకు జోడీగా ఓ బాలీవుడ్ నటిని చూపించాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యారాయ్ బచ్చన్, విద్యాబాలన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఐశ్వర్యారాయ్ లేదా విద్యాబాలన్‌లలో ఎవరో ఒకర్ని కచ్చితంగా చిరంజీవి సినిమాలో చూపించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. వారిద్దరిలో ఎవరైనా ఒకరు ఈ సినిమాలో కచ్చితంగా నటించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ సక్రమంగా టైమ్ కు జరిగితే ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.