Sports

చీరకట్టి.. చిందేసిన వార్నర్‌ సేన

 

 

 

 

 

 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆడి పాడింది. ఆటగాళ్లంతా గమ్మత్తైన మాటలతో హోరెత్తించారు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వారు ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ ఆరెంజ్‌ ఆర్మీ’ అనే కార్యక్రమం నిర్వహించారు. అందులో ఆటగాళ్లంతా సరదా సరదాగా సందడి చేశారు.

సారథి డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బెన్‌కటింగ్స్‌కు నారింజ రంగు తలపాగా చుట్టారు. వారితో డైలాగులు పలికించారు. ఇక టీమిండియా గబ్బర్‌ (శిఖర్‌) ఓ అడుగు ముందుకేసి ‘సమర సింహారెడ్డి’లో బాలకృష్ణ రేంజ్‌లో తొడగొట్టేశాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌.. శిఖర్‌ ధావన్‌కు చీర చుట్టేయబోయాడు. వీరు నలుగురూ ఓ నలుగురికి చీర కట్టారు. పిల్లలతో సరదా క్రికెట్‌ ఆడారు. సందడి చేశారు. ఆనందించారు.