Movies

చైనాలో ‘దంగల్‌’కు 4రోజుల్లో రూ.100 కోట్లు

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’భారత్‌లోనే కాదు చైనాలోనూ రికార్డులు సృష్టిస్తోంది. 7000 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతకుముందు ఆమిర్‌ నటించిన పీకే చైనాలో రూ.100 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. అంతేకాదు చైనాలో అన్ని కోట్లు రాబట్టిన తొలి బాలీవుడ్‌ చిత్రం కూడా పీకేనే. కానీ ఇప్పుడు దంగల్‌ పీకేను దాటేసింది. ఈ సందర్భంగా ఆమిర్‌, దర్శకుడు నితీశ్‌ తివారీ చైనా ప్రేక్షకులకు సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.