Latest News Movies

జక్కన్నకు త‌లైవా సెల్యూట్

బాహుబ‌లి 2 పై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ భార‌త చలనచిత్ర రంగానికి గ‌ర్వకారణమ‌ని సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్వీట్ చేశారు. క‌న్‌క్లూజ‌న్ ఓ మాస్ట‌ర్‌పీస్ అని, డైర‌క్ట‌ర్ రాజ‌మౌళికి, ఆయ‌న టీమ్‌కు సెల్యూట్ అని త‌లైవా ట్వీట్ చేశారు. ర‌జ‌నీకాంత్ చేసిన ట్వీట్‌కు డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కూడా స్పందించారు. దేవుడే మ‌మ్మ‌ల్ని దీవించిన‌ట్లుగా ఉంద‌న్నారు. తమ బృందం సంతోషంలో ఉంద‌ని రాజ‌మౌళి రీ ట్వీట్ చేశారు.