Latest News Movies

జర్నలిస్టు సోనాక్షి సిన్హా…

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తాజా చిత్రం ‘నూర్‌’. లో జర్నలిస్టుగా కనిపించబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. అయితే.. జర్నలిస్టుగా నటించిన తర్వాత జర్నలిస్టుల పని ఎంతకష్టమో అనుభవంలోకి వచ్చిందట.
‘ఎంత జర్నలిస్టుగా మారినా.. నేను నటిని. కాబట్టి జర్నలిస్టుకు ఉండే ఇబ్బందులు.. కష్టాలు నేను అంతగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ.. అవగాహన వచ్చింది. జర్నలిస్టులది థ్యాంక్‌లెస్‌ జాబ్‌. జర్నలిజం ఎంత కష్టమో అర్థమైంది. కథనాల కోసం పరుగులు పెట్టాలి. ఎంతోమందిని మర్యాదపూర్వకంగా కలవాలి. వారిని ప్రసన్నం చేసుకోవాలి. అదీ కాకుండా డెడ్‌లైన్స్‌ ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని పనిని కూడా ఉద్యోగ రీత్యా చేయాల్సి ఉంటుంది’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.