Technology

జియో మరో సూపర్ ఆఫర్

రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఆఫర్‌ కింద రూ.1999తో జియో కొత్త డాంగిల్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.2010 విలువ చేసే 4జీ డేటాను 84రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో జియో డాంగిల్‌ను కొనుగోలు చేయని వారికి రూ.1005 విలువ చేసే 4జీ డేటాను అందిస్తుంది. జియో కొత్త డాంగిల్‌ ధర రూ.1999కాగా, ఇప్పటికే ఇంటర్నెట్‌ డాంగిల్‌ వినియోగిస్తున్న వారు కొత్త దాని కోసం రూ.999 చెల్లించి ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా వినియోగదారుడు రూ.1000 డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.