Technology Trends

జియో యూజర్లకు శుభవార్త.

 

 

 

 

 

 

 

 

 

 

 

రిల‌యెన్స్ జియోకు ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యాన్ని ట్రాయ్ ప్రకటించింది. ఆ సంస్థ ప్ర‌క‌టించిన ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌లో త‌ప్పు ప‌ట్టాల్సింది ఏమీ లేద‌ని స్ప‌ష్టంచేసింది. టెలికాం రెగ్యులేట‌రీ నిబంధ‌న‌ల‌ను ఈ ఆఫ‌ర్ ఉల్లంఘించ‌డం లేద‌ని ట్రాయ్ చెప్పింది.
ఈ ధ‌న్ ధ‌నా ధ‌న ఆఫ‌ర్ కొత్త సీసాలో పాత సారా అంటూ ప్ర‌త్య‌ర్థి టెలికాం కంపెనీలు ఆరోపించినా.. ట్రాయ్ మాత్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. జియో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌కు దీనికి చాలా తేడాలున్నాయ‌ని ట్రాయ్ అభిప్రాయ‌ప‌డింది. ఈ స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను వెంట‌నే నిలిపేయాల‌ని ఆదేశించ‌డంతో జియో కొత్త‌గా ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్ తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే 303 ఉన్న రేటును 309కి మార్చ‌డం త‌ప్ప అదే ఆఫ‌ర్‌ను కొన‌సాగించింది జియో. ఇదే విష‌యాన్ని ఎయిర్‌టెల్ ట్రాయ్ ద‌గ్గ‌ర లేవ‌నెత్తింది.