Featured Latest News

జియో సూపర్ ప్లాన్స్..100శాతం క్యాష్ బ్యాక్

రిలయన్స్ జియో మళ్లీ సంచలన ఆఫర్లను వినియోగదారుల ముందుట ఉంచింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.