Latest News

జ‌స్టిస్ క‌ర్ణ‌న్ దేశం విడిచి వెళ్లారు..!

కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఆర్నెళ్ల శిక్ష‌ పడిన వివాదాస్ప‌ద కోల్‌క‌తా న్యాయ‌మూర్తి క‌ర్ణ‌న్ కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ దేశం విడిచి వెళ్లి ఉంటార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోల్‌క‌తా నుంచి ఆయ‌న బుధ‌వారం ఆంధ‌ప్ర‌దేశ్ చేరుకున్న‌ట్లు స‌మాచారం ఉంది. అయినా ఆయ‌న ఆచూకీ మాత్రం చిక్క‌లేదు. జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌కు చాలా ద‌గ్గ‌రగా తెలిసిన వ్య‌క్తులు మాత్రం ఆయ‌న నేపాల్ వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త‌డా ప్రాంతాల్లో ఉన్న‌ట్లు మొద‌ట అనుమానించినా అక్క‌డ నుంచి ఆ న్యాయ‌మూర్తి నేపాల్ చేరుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. క‌ర్ణ‌న్ నేపాల్ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కూడా తెలుస్తున్న‌ది. ఫ్రాన్స్‌లో క‌ర్ణ‌న్ కుమారుడు ఉద్యోగం చేస్తున్నారు. త‌న కుమారుడి ద‌గ్గ‌ర‌కు క‌ర్ణ‌న్ వెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అత‌ని స‌మీప మిత్రులు అనుమానిస్తున్నారు. కానీ క‌ర్ణ‌న్‌కు సంబంధించిన లాయ‌ర్ మాత్రం మ‌రో అభిప్రాయాన్ని వినిపించారు. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ భార‌త్‌లోనే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. జ‌డ్జి ఫోన్ ట్రాకింగ్‌ ఆధారంగా అత‌ను ఏపీలో ఉన్న‌ట్లు పోలీసులు మొద‌ట నిర్ధారించారు. కోల్‌క‌తా పోలీసులకు ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్ణ‌న్ ఆచూకీ చిక్క‌లేదు.