Politics

ట్విట్టర్ వార్..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్‌ సింగ్‌ మధ్య ట్విటర్‌ వార్ ఓ రేంజ్ లో సాగింది. ఇరునేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ‘తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్‌ వెబ్‌సైట్‌ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్‌ అధికారం ఇచ్చారా?. అలా అయితే ఆయ‌న‌‌ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ తీరుపై విరుచుపడ్డారు. ‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదు. దిగ్విజయ్‌ సింగ్‌ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేదంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్‌కు లేదు.’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.