Politics

డాన్ తో లింకులు..చిక్కుల్లో లాలూ..

ఆరడగుల అర్నాబ్ మీడియా తొలి బుల్లెట్ లాలూను టార్గెట్ చేసింది. రావడం రావడంతోనే ఆయన్ను చిక్కుల్లో పడేసింది. లాలూకు డాన్ షహబుద్దీన్ తో లింకులు ఉన్నట్లు తొలిరోజే ప్రసారాల్లోనే రిపబ్లిక్ టీవీలు స్టోరీలు కుమ్మేసింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న డాన్, ఆర్జేడీ నేత మహ్మద్ షహబుద్దీన్‌తో లాలూ మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టేప్ బయటపడింది. లాలూకు షహబుద్దీన్ జైలు నుంచి ఫోన్ చేసి అల్లర్లకు సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నట్లు ఈ టేపులో వినిపిస్తోంది.

ఈ ఆడియో టేపును ఈరోజే ప్రసారాలను ప్రారంభించిన రిపబ్లిక్ టీవీ ఛానల్ విడుదల చేసింది. ఆ ఛానల్ కథనం ప్రకారం లాలూ ప్రసాద్ యాదవ్ ఈ టేపులపై స్పందించలేదు. ఈ టేపును ప్రసారం చేయవద్దని ఆయన అనేకసార్లు కోరినట్లు తెలిపింది.