Movies

డాన్ దావూద్ న్యూ లుక్ ఎలా ఉందంటే…


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవితం నేపథ్యంలో ‘హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’ అనే సినిమా రాబోతోంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హసీనా పార్కర్ పాత్రని శ్రద్ధా కపూర్ పోషిస్తుండగా, దావూద్ పాత్రలో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఇటీవల  శ్రద్ధా లుక్ ని విడుదల చేసిన టీం తాజాగా దావూద్ గా నటిస్తున్న సిద్ధాంత్ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ లో సిద్ధాంత్ చాలా దర్పంగా కూర్చొని ఉన్నట్టుగా ఉంది. ఈ సినిమా కోసం అటు శ్రద్ధా, ఇటు సిద్ధాంత్ లు దుబాయ్ వెళ్ళి వాటి కుటుంబ సమాచారాలన్నీ కనుక్కున్నారు. మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షిండే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల కోసం ప్రోస్తెటిక్స్ మేకప్ ఉపయోగించి పలు లుక్స్ డిజైన్ చేశాడు.