Featured

తలకిందులుగా చెట్టులెక్కగలవా…

 

 

 

 

 

 

మమూలుగా చెట్టు ఎక్కాలంటేనే తెగ ప్రయత్నిస్తాం.. కానీ హర్యానా యువకుడు తలకిందులుగా చెట్లు ఎక్కేస్తున్నాడు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించడమే తన లక్ష్యం అంటున్నాడు.

32 ఏళ్ల ముఖేశ్‌కుమార్‌ 13వ ఏట నుంచే తలకిందులుగా చెట్లు ఎక్కడం ప్రారంభించాడు. ‘అందరూ మాములుగా చెట్లు ఎక్కుతారు, నేను తలకిందులుగా ఎందుకు ఎక్కకూడదు అనుకున్నాను. వెంటనే సాధన ప్రారంభించా. మొదట రెండు, మూడు అడుగుల ఎత్తు మాత్రమే చెట్టు ఎక్కగలిగేవాడిని, నిరంతరం సాధనతో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కేస్తున్నాను. 50 అడుగుల చెట్టును కేవలం ఐదు నిమిషాల్లోనే ఇలా ఎక్కగలను. కానీ దిగడానికి మాత్రం కొంత సమయం పడుతుంది.’ అంటున్నాడు ముఖేశ్‌. ఇంకా తక్కువ సమయంలో తలకిందులుగా చెట్టు ఎక్కి గిన్నిస్‌ రికార్డు సాధించాలని, దీని ద్వారా కొంత డబ్బు సంపాదించి కుటుంబానికి అండగా ఉంటానని ముఖేశ్‌ చెబుతున్నాడు.