crime

తల్లిని కొట్టి కూతుర్ని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

 

 

 

 

 

 

 

 

 

బీహార్ లో దారుణం జరిగింది. మృగాళ్లు రెచ్చిపోయారు. తల్లిని కొట్టి కూతుర్ని లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
కైమూర్ జిల్లా సిరిబిత్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తల్లితో కలిసి బహిర్బూమికి వచ్చిన కూతురిని లాక్కెళ్లిన దుండగులు గ్యాంగ్ రేప్ చేసి వదిలేశారు. తల్లి విషయాన్ని గ్రామస్థులకు చెప్పడంతో వారు శివార్లకు వెళ్లి గాలించగా స్పృహ తప్పి పడి ఉన్న బాలిక కనిపించింది. బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఏడుగురు నిందితులపై 376 డి, సెక్షన్ 4, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలికపై గ్రామానికి చెందిన ఫహీంఖాన్, షాకూత్ అలియాస్ టబుఖాన్, ఇలియాస్ ధోబీ, ఫిరోజ్ ఖాన్, గుడ్డు ఖాన్, అమీర్ ఖాన్, షేయర్ ఖాన్ లు అత్యాచారం చేశారని మహిళా పోలీసు స్టేషన్ అధికారిణి అంచలా కుమారి చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని త్వరలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు.