crime Featured2 Latest News

తాగొద్దన్నందుకు భార్యపై కాల్పులు

 

మద్యం తాగొద్దన్నందుకు ఓ భర్త తన భార్యపై కాల్పులు జరిపాడు. ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బీఎస్‌ఎఫ్ మాజీ జవాను నిత్యానంద పదేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అయితే నిత్యానందకు మద్యం తాగే అలవాటు ఉంది. ఇటీవలి కాలంలో భర్త మద్యం అతిగా సేవిస్తుండటంతో భార్య తాగొద్దని వారించింది. దీంతో కోపోద్రిక్తులైన నిత్యానంద తన భార్యపై కాల్పులు జరిపాడు. వీరి ఇద్దరు పిల్లలు కాల్పుల శబ్దం విని పక్కింటి వారికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన భార్య సునీతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానందను అరెస్టు చేశారు.