Latest News Movies

త్వరలో సుచీలీక్స్ 2

సుచీలీక్స్ పార్ట్-2 పేరిట హాక‌ర్లు మ‌రో సంచ‌ల‌న వివాదానికి తెర‌తీయ‌బోతున్నార‌ట‌. సుచీలీక్స్‌కు సంబంధించి… మ‌ళ్లీ అలాంటి ఫొటోలు, వీడియోలు ట్విట్ట‌ర్లో పెట్ట‌కుండా లోగుట్టు బ‌య‌ట‌ప‌డిన స్టార్ హీరోలు, హీరోయిన్లు హాక‌ర్ల‌కు కొంత సొమ్మును ముట్ట‌జెప్పార‌ని కోలీవుడ్ వ‌ర్గాల టాక్.

ఈ నేప‌థ్యంలోనే మ‌రింత డబ్బుకు ఆశ‌ప‌డిన హాక‌ర్లు సుచీలీక్స్-2కు తెర‌తీస్తున్నార‌ట‌. ఇంకా సొమ్ము చెల్లిస్తే త‌ప్ప‌.. మిగిలిన సీక్రెట్ ఫొటోలు, వీడియోలను బ‌హిర్గ‌తం చేయ‌బోమ‌ని చెప్పార‌ట‌. అడిగినంత మొత్తం ఇవ్వ‌కుంటే మాత్రం మ‌ళ్లీ ఇర‌కాటంలో ప‌డాల్సి వ‌స్తుంద‌ని స‌ద‌రు స్టార్ హీరోల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ట హాక‌ర్లు. సుచీలీక్స్ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకుంటున్న లోపే.. మ‌ళ్లీ ఇలా సుచీలీక్స్ పార్ట్-2 పేరుతో హాక‌ర్లు.. స్టార్ హీరోలు, హీరోయిన్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రి, హాకర్లు అడిగిన మొత్తాన్ని కోలీవుడ్ స్టార్లు స‌మ‌ర్పించుకుంటారా..? లేదా సుచీలీక్స్ వ్య‌వ‌హారాన్ని తెర‌మ‌రుగు చేసేందుకు ఏవైనా చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. అయితే సింగ‌ర్ సుచిత్ర పేరుతో కొంద‌రు హాక‌ర్లు కావాల‌నే ఇదంతా చేశార‌ని ఇటీవ‌ల సుచిత్ర క్లారిటీ ఇచ్చింది.