Featured Movies

దాదా సాహెబ్ విశ్వనాథ్ కు చిరు కంగ్రాట్స్

 

 

 

 

 

 

కళా తపస్వి విశ్వనాథ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో కళాత్మకమైన చిత్రాలను అందించిన దర్శకుడు విశ్వనాథ్‌.. ఫాల్కే పురస్కారానికి పూర్తి అర్హుడని కొనియాడారు. ఫిల్మ్‌నగర్‌లోని విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి విశ్వనాథ్‌ ఎంపిక కావడం వల్ల ఆ పురస్కారానికే నిండుదనం చేకూరిందన్నారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాల్లో నటించారు.