Featured Social

‘దెబ్బకు దెబ్బ తీయాలి… పాక్ సైనికుల తలలు నరకాలి’


తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పాకిస్థాన్‌కు చెందిన 50 మంది సైనికుల తలలు తీసుకురావాలని అమరజవాను ప్రేమ్‌సాగర్‌ కుమార్తె విలపిస్తోంది. నియంత్రణ రేఖ దగ్గర సోమవారం బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్‌తో పాటు మరో జవానును పాక్‌ సైన్యం అతి కిరాతకంగా తలను మొండెం నుంచి వేరు చేసి హతమార్చింది. మంగళవారం జవాను స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఆయనకు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

అమర జవాను కుమార్తె సరోజ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘దేశం కోసం నా తండ్రి ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగం వూరికే పోదు. అందుకు ప్రతీకారంగా 50 మంది పాకిస్థాన్‌ సైనికుల తలలు తీసుకురావాలి’ అని అన్నారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన నా సోదరుడిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. కానీ పాక్‌ సైన్యం అత్యంత కిరాతకంగా వ్యవహరించింది’ అంటూ ప్రేమ్‌సాగర్‌ సోదరుడు దయాశంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ దగ్గర పాక్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌(బీఏటీ) భారత సైనికులు, సరిహద్దు భద్రతా దళంపై దాడి చేసి ఇద్దరు జవాన్లను పొట్టనబెట్టుకోవడమే కాకుండా అత్యంత క్రూరంగా వారి మృతదేహాలను ఛిద్రం చేసింది. వారి తలలను మొండెం నుంచి వేరు చేసింది. ఇందుకు ప్రతీకారంగా భారత్‌.. పాక్‌ బంకర్లపై దాడి చేసి ఏడుగురు సైనికులను హతమార్చింది.ః

అటు పాక్‌ దుశ్చర్యపై మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైనికులను క్రూరంగా చంపడం కలచివేసిందని.. ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలు వృథా కాకుడదన్నారు. మన సైనికులను చంపినందుకు పాక్‌కు చిన్న డోస్‌ సరిపోకపోతే కాస్త పెద్ద డోస్‌ ఇచ్చి బుద్ధిచెప్పాలంటూ ట్వీట్ చేశారు.