Featured2 Latest News Politics

దేవినేని నెహ్రూ ఇక లేరు

 

గుండెపోటుతో చనిపోయిన తెలుగుదేశం నేత దేవినేని నెహ్రూ భౌతికకాయాన్ని విజయవాడకు తరలించారు. ఈరోజు ఉదయం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, టీడీపీ నేతలు ఒక్కక్కరిగా ఆస్పత్రికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. సినీ నటుడు నందమూరి హరికృష్ణతో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆస్పత్రికి చేరుకుని నెహ్రూతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం కేర్‌ ఆస్పత్రి మార్చురీ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో దేవినేని మృతదేహాన్ని విజయవాడకు తరలించారు.